మంగళవారం ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో కొత్త పట్టాదారు పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆస్తులకు రక్షణ కల్పించేలా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఇచ్చే ఈ పుస్తకాలు రైతులకు, భూయజమానులకు స్థైర్యాన్ని ఇస్తాయని ఆయన అన్నారు.