ఇరగవరం మండలం ఏలేటిపాడుకు చెందిన మంత్రి రాజేష్ అలియాస్ బాబి అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడి చేసినట్లు 2023లో కేసు నమోదైంది.బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుని లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఫోక్సో కోర్టు జడ్జి లక్ష్మీనారాయణ సోమవారం తీర్పు చెప్పారు. కేసు దర్యాప్తులో నిందితుడికి జైలు శిక్ష విధించినట్లు ఇరగవరం ఎస్సై జానా సతీష్ తెలిపారు.