కాళ్ళ మండలంలోని వేంపాడు, కోపల్లె గ్రామాలలో శుక్రవారం ఉదయం లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి "ఎన్టీఆర్ భరోసా" సామాజిక భద్రత పింఛన్లను, కొత్త స్పౌజ్ పెన్షన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు పింఛన్లు అందజేశారు. ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.