జాతీయ రహదారిపై కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

తణుకు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం షర్మిష్ట జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారు అదుపుతప్పి మోటార్ సైకిల్‌పై వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్