బయో డీగ్రేడబుల్ సంచుల తయారీ అభినందనీయం: ఎమ్మెల్యే రాధాకృష్ణ

తణుకులో ఎకో టాన్ పేరుతో బయో డిగ్రేడబుల్ కవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ప్రకృతిని కాపాడుకునే విధంగా బాధ్యతగా సామాజిక స్పృహతో బయో డీగ్రేడబుల్ సంచులను తయారు చేయడం అభినందనీయమని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా వీటి వినియోగం పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడటానికి చాలా అవసరమని, ఇవి 180 రోజుల్లో మట్టిలో కలిసిపోతాయని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈ యూనిట్ ను ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు.

సంబంధిత పోస్ట్