ఇరగవరం మండలం గవర్లపాలెం గ్రామంలో శ్రీ వాణి నిధులతో నిర్మించబడనున్న గౌరీ పరమేశ్వర ఆలయ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని, ఆలయ నిర్మాణానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలతో కలిసి ఈ శుభకార్యంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.