తణుకులో మిస్టరీ.. డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి?

తణుకు బ్యాంకు కాలనీలో గుడ్డాల నాగరాజు (40) అనే వ్యక్తి డ్రైనేజీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భీమవరంలో భార్యతో ఉంటున్న నాగరాజు, గురువారం రాత్రి తల్లి వద్దకు తణుకు వచ్చాడు. తెల్లవారేసరికి డ్రైనేజీలో శవమై కనిపించాడు. మద్యం మత్తులో పడి మరణించాడా లేక వేరే కారణాలున్నాయా అనే దానిపై విచారణ జరుగుతోంది. ఘటనాస్థలాన్ని సీఐ డి.వెంకటేశ్వరరావు, ఎస్ఐ కె.శ్రీనివాస్ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్