యువతకు క్రీడా స్ఫూర్తి, డ్రగ్స్‌కు దూరం: ఎమ్మెల్యే ఆరిమిల్లి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ, యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తణుకులో 'డ్రగ్స్ వద్దు బ్రో' నినాదంతో ఎన్టీఆర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ మూడో ఎడిషన్ ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు స్మారకార్థం ఈ టోర్నమెంట్ ను శుక్రవారం ప్రారంభించారు. 2023లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్, భవిష్యత్తులో ప్రతి ఏటా తణుకు పట్టణానికి ప్రతిష్టాత్మకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్