తణుకు ఇరగవరం మండలంలో వరి కోత పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 12 వేల ఎకరాల్లో సాగైన వరిలో 80 శాతం కోతలు పూర్తయ్యాయి. ఎకరానికి 50 బస్తాల దిగుబడి వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి రావడంతో అధికారులు ధాన్యం సేకరణ పనులను ముమ్మరం చేశారు.