తణుకు లో రోడ్డు ప్రమాదం... వృద్ధుడు మృతి

తణుకు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెరవలి మండలం కాపవరం గ్రామానికి చెందిన ప్రత్తిపాటి కాశయ్య(75) మృతి చెందారు. తన మోటార్ సైకిల్ పై యూటర్న్ తీసుకుంటుండగా, వెనుక నుంచి వచ్చిన రైతు రథం వ్యాన్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్