తేతలి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పెరవలి మండలం ఖండవల్లికి చెందిన కాపా కార్తీక్(24) మృతి చెందాడు. తేతలిలో జరుగుతున్న జాతర ఉత్సవం నుంచి రోడ్డు దాటుతున్న మినీ వ్యాన్ ను మోటార్ బైక్ పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతను సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆయన ప్రస్తుతం తేతలిలో నివాసం ఉంటున్నాడు.

సంబంధిత పోస్ట్