బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి.. పనిలో కాదు జిల్లా జడ్జి

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, తణుకులోని శ్రీ చైతన్య టెక్నో హైస్కూల్లో శుక్రవారం అవగాహన కార్యక్రమం జరిగింది. నాలుగవ అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి ఆదేశాల మేరకు, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. స్వర్ణ విద్యార్థులకు బాలల హక్కులు, బాల కార్మిక నిషేధ చట్టం, నిర్బంధ విద్య హక్కు చట్టం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నిరోధక చట్టాలపై వివరించారు. 14 ఏళ్ల లోపు పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలని, బాల కార్మికులను గుర్తిస్తే చైల్డ్ లైన్ 1908 లేదా న్యాయ సేవల సంస్థ టోలీఫ్రీ 15100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్