రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర ప్రజా పోరాటాలు సాగిస్తూ కూటమి పార్టీలకు, వైసీపీకి వ్యతిరేకంగా సీపీఐ మూడవ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం తణుకు సురాజ్య భవన్‌లో జరిగిన సీపీఐ జిల్లా సమితి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల కనీస అవసరాల కల్పనకు సీపీఐ నిరంతరం ఉద్యమిస్తుందన్నారు.