తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ధాన్యం లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తణుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.