లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావుకు రాజమండ్రి ఏసీబీ కోర్టు మంగళవారం 14 రోజుల రిమాండ్ విధించింది. సోమవారం ఒక చీటింగ్ కేసులో లంచం తీసుకుంటుండగా సుబ్బారావు పట్టుబడ్డారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో నిందితుడిని కోర్టులో హాజరుపరచగా ఈ రిమాండ్ విధించినట్లు తెలిపారు.