రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేంజ్ మేకర్స్ కార్యక్రమంలో భాగంగా, తణుకు పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 350 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. విద్యార్థులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.