పశ్చిమగోదావరి జిల్లా తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం తాత్కాలిక ఉద్యోగులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తాత్కాలిక ప్రతిపాదికన పనిచేస్తున్న ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. తాత్కాలిక ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకోవడం దారుణమని, కోర్టు తీర్పు అమలులో జాప్యం చేయకుండా వారిని రెగ్యులర్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రతాప్ ప్రభుత్వాన్ని కోరారు.