తణుకులో శుక్రవారం రాత్రి పుట్టినరోజు వేడుకల పేరుతో రోడ్లపై సంచరిస్తూ, బాణాసంచా కాల్చుతూ వీరంగం సృష్టించిన ఆకతాయిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె. శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనలో 15 మందిని తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించి సీఐ కొండయ్య వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేసినట్లు వారు చెప్పారు.