తణుకు: నేడు మూడు మండలాలకు పవర్ కట్

తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలో విద్యుత్ సబ్ స్టేషన్లలో పలు లైన్లు మరమ్మతుల కారణంగా శుక్రవారం కరెంటును నిలిపివేస్తున్నట్లు డీఈ నరసింహమూర్తి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నందున వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్