నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం తణుకులోని ఎస్కే ఎస్డి మహిళ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. 70 కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా 3,500 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. అందరికీ ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.