తణుకు: మృతుడి ఆచూకీ లభ్యం

కాలువలో పడి మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. తణుకు వేల్పూరు రోడ్డులో నివాసం ఉంటున్న పోలా శ్రీనివాసరావు (58) శుక్రవారం హెయిర్ కట్ చేయించుకుందామని వెళ్లి అనంతరం స్నానం కోసం కాలువలో దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంతో కాస్త దూరంలోనే మృతదేహం లభ్యమైంది. మృతుడి కుమారుడు నాగ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు పట్టణ ఎస్ఐ కె.శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్