తణుకు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేల్పూరుకు చెందిన అందే వెంకటలక్ష్మి (48) మృతి చెందారు. ఆమె భర్త లోకేశ్వరరావుతో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మరణించగా, గాయపడిన లోకేశ్వరరావును తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్