పల్లెల్లో స్వచ్ఛమైన నీరు అందించడమే తమ లక్ష్యం... ఎమ్మెల్యే

తణుకు నియోజకవర్గం, ఇరగవరం మండలం కే. కుముదవల్లి గ్రామంలో రూ. 1.86 లక్షల వ్యయంతో 40,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, పంపు హౌస్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్