ఆటోలో మహిళల దోపిడీ.. ఇద్దరు అరెస్ట్

ఏలూరులో ప్రయాణికుల మాదిరి ఆటో ఎక్కి దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరు మహిళలను త్రీ టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఏలూరు నుంచి ధర్మాజీగూడెం వెళ్లేందుకు ఒక మహిళ ఆటో ఎక్కగా, ఆమెతో పాటు మరో ముగ్గురు ఆటో ఎక్కి, చాకచక్యంగా ఆమె బ్యాగులోని రూ.10 వేలు దొంగిలించారు. రూ.500 నోటు కింద పడటంతో బాధితురాలు గమనించి, ఆటో డ్రైవర్ సహాయంతో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీఐ కోటేశ్వరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్