ఆకివీడులోని గుమ్ములూరు కూడలి వద్ద జాతీయ రహదారి పక్కనున్న ఏటీఎం గది తలుపు తెరిచి ఉండటం, అద్దాలు పగిలి ఉండటంతో చోరీకి యత్నించారన్న వార్తలు గురువారం ప్రచారంలోకి వచ్చాయి. కానీ, బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు తలుపును గట్టిగా గుద్దడంతో అద్దాలు పగిలాయని సీఐ జగదీశ్వరరావు సీసీ కెమెరాల ద్వారా తెలిపారు. ఏటీఎంలో నగదు సురక్షితంగానే ఉందని పేర్కొన్నారు.