తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం గురువారం ఆకివీడు మండలం అజ్జమూరులోని ఎంపీపీ పాఠశాల నందు స్కూలు పిల్లలతో కలిసి ఆకివీడు మండల బీజేపీ అధ్యక్షురాలు ఎంవీఎస్ నాగమణి, బీజేపీ నాయకులు చింతా ఆదిశేషు, నంద్యాల చల్లారావు, గోపికృష్ణ భోజనం చేశారు. మధ్యాహ్నం భోజన పథకంలో ఈ రోజు చక్కెర పొంగలి, పలావు, పెరుగు చెట్ని, బాయిల్డ్ ఫ్రై ఎగ్, బంగాళదుంప కర్రీ, ములక్కాడ కర్రీ, సన్న బియ్యం రైస్, సాంబారు, పెరుగుతో భోజనాలు వడ్డించారు.