ఆకివీడు సీఐ జగదీశ్వరరావుపై మంగళవారం సస్పెన్షన్ వేటు పడింది. డెడ్ బాడీ పార్సెల్ కేసులో నిందితుడు సుధీర్ వర్మపై పోక్సో కేసు నమోదు చేయలేదనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఉన్నతాధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. జగదీశ్వరరావు 2024 ఆగస్టులో ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నియమితులయ్యారు.