ఆకివీడులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వైఎస్ఆర్ సీపీ నాయకులు అంబటి రాంబాబు అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆకివీడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్సై హనుమంతు నాగరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో ఏయంసి చైర్మన్ బొల్లా వెంకట్రావు, టీడీపీ నాయకులు మోటుపల్లి రామవర ప్రసాద్, నౌకట్ల రామారావు, పట్టణ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ, కిమిడి నాగరాజు, యండి అజ్మల్, యండి షాకీర్, గొంట్లా గణపతి తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.