ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐలో 2వ విడత ఐటీఐ సీట్ల కోసం ఈనెల 20 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వేగేశ్న శ్రీనివాసరాజు సోమవారం కోరారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకుని రసీదు పొందాలని, ఆ రసీదును ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నిర్వహించే కౌన్సిలింగ్లో తప్పనిసరిగా చూపించాలన్నారు.