కలెక్టర్ నాగరాణి ఆకస్మిక తనిఖీ: ఉల్లాస్ అక్షరాస్యతా కార్యక్రమంపై సమీక్ష

కాళ్ల మండలం పెద్దఅమిరం సచివాలయంలో నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షరాంధ్ర అక్షరాస్యతా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చదువు రాని వారి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా, కార్యక్రమ అమలు తీరును, విద్యార్థుల పురోగతిని ఆమె సమీక్షించారు. నిరక్షరాస్యతను నిర్మూలించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరింత మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్