చెరుకువాడలో డాక్టర్ గాదిరాజు రంగరాజుకు ఘన సన్మానం

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామస్తులు, సాహితీవేత్త, నటుడు, పరిశోధకుడు డాక్టర్ గాదిరాజు రంగరాజును ఘనంగా సత్కరించారు. ఇటీవల మైసూరు విశ్వవిద్యాలయం నుండి కర్ణాటక రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా ఈ సన్మానం జరిగింది. గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు, కార్యదర్శి KV సుభాషిణిలు రంగరాజును సత్కరించి, అభినందించారు. RWS DE తానింకి శ్రీనివాసరావు, AE హరనాధరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్