భీమవరం, హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కళా రంగంలో విశిష్ట సేవలు అందించి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఫోకస్ సంస్థ అధ్యక్షులు గొన్నాబత్తుల మల్లేశ్వరరావు, ఆదిత్య కృష్ణంరాజులను అసోసియేషన్ అధ్యక్షులు S. రామారావు శనివారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో కంతేటి వెంకటరాజు, మధుసూదన రావు, సత్యనారాయణ, కోటేశ్వరరావు, రామకృష్ణ, శ్రీను, రాంప్రసాద్, వెంకట్రావు, శ్రీనివాస్, సూరిబాబు, అప్పారావు, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు.