ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆదేశాల మేరకు, 'ల్యాబ్స్ ఆన్ వీల్స్' ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ అందించనున్నారు. ఈ నెల 29, 30 తేదీలలో ఆకివీడులోని వి. వి. గిరి ప్రభుత్వ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్తో కూడిన బస్సు అందుబాటులో ఉంటుందని వైస్ ప్రిన్సిపల్ యోగేశ్వరరావు తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఈ మొబైల్ ల్యాబ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.