ఆకివీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని రోగులకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఉచిత భోజనం శనివారం అందించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురాం కృష్ణంరాజు ఆదేశాల మేరకు, నవంబర్ 15 నుండి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం ఉచితంగా అందిస్తామని గంధం ఉమా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.