చింతలగరువులో గాంధీ వర్ధంతి: బాపు తొలి చూపు ఆల్బమ్ ప్రదర్శన

పోడూరు మండలం చింతలగరువు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హెచ్ ఎం కొల్లాబత్తుల సూర్య కుమార్ మాట్లాడుతూ, సత్యం, శాంతి, అహింసా పథమే ఆయుధంగా చరిత్రపై చెరగని ముద్ర వేసిన మహానీయుడు గాంధీజీ అని కొనియాడారు. SMC చైర్మన్ బొంతు వీరాంజనేయులు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సూర్య కుమార్ తయారు చేసిన బాపు తొలి చూపు ఆల్బమ్, గాంధీ స్మారక స్టాంపులు, నాణేములను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టీచర్ మట్టా నాగరాజు, అంగన్వాడీ టీచర్ వేండ్ర గజలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్