ఆకివీడులోని ఎముకల ఆసుపత్రి వైద్యుడి తండ్రిని శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఆలపాడు వద్ద కిడ్నాప్ చేసే ప్రయత్నం జరిగింది. యోగా సాధన అనంతరం చేపల చెరువు వద్దకు వెళ్తున్న ఆయనను కారు ఆపి, పోలీసులమని చెప్పి కొందరు అడ్డగించారు. అయితే, ఆయన వారి నుంచి తప్పించుకొని వెళ్లిపోయారు. అడ్డగించిన యువకులు భీమవరంలోని ఒక ప్రైవేటు కళాశాల విద్యార్థులని సమాచారం.