ఆకివీడు మండలం దుంపగడపలోని వి.వి. గిరి ప్రభుత్వ కళాశాలలో ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 9:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి అధికారి, పశ్చిమ గోదావరి జిల్లా, ఇన్ఫోసిస్ స్పింగ్ బోర్డుతో కలిసి 'ల్యాబ్ ఆన్ వీల్స్' ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు రోబోటిక్స్, 3D డిజైనింగ్, మైక్రో కంట్రోలర్, ఎలక్ట్రానిక్స్ పై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ డా. పీ.బీ. ప్రతాప్ కుమార్ ఈ అవకాశాన్ని స్థానిక విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.