ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ఘన సన్మానం

ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు గాదిరాజు రంగరాజు, ఉపాధ్యక్షుడు భూపతిరాజు హరనాధరాజులను గురువారం ఉండితోటలో సన్మానించారు. సేవ, కృషి, పట్టుదలకు ఈ సన్మానం నిదర్శనమని ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణ రెడ్డి అన్నారు. రంగరాజు నాటకరంగంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందగా, హరనాధరాజు ఉత్తమ రైతు, సేవా పురస్కారాలు అందుకున్నారని రుద్రరాజు నరసరాజు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు లయన్స్ సభ్యులు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్