ఎరువులు, పురుగుమందులు ప్రభుత్వ నియమావళికి విరుద్ధంగా విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని మండవల్లి ఏడీఏ జి. వెంకటమణి హెచ్చరించారు. బుధవారం లింగాల గ్రామంలోని ఓ ఫెస్టిసైడ్ షాపులో తనిఖీ నిర్వహించి స్టాక్ రిజిస్టర్, నిల్వల వివరాలు పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ సందర్భంగా ఎరువుల విక్రయానికి రసీదు తప్పనిసరి అని పేర్కొన్నారు.