ప్రైవేట్ స్కూల్లో పుస్తకాల విక్రయం... సీజ్ చేసిన ఎంఈఓ

ఉండి గ్రామం రాజులపేటలోని శ్రీశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యాజమాన్యం విద్యార్థులకు పుస్తకాలు విక్రయిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు డీఈఓ కు ఫిర్యాదు చేశారు. దీనితో బుధవారం ఎంఈఓ స్కూలును తనిఖీ చేశారు. గేటు తెరవకపోవడంతో సీజ్ చేస్తామని హెచ్చరించాక యాజమాన్యం గేటు తీసింది. మీడియాను లోపలికి అనుమతించలేదు. స్కూలు ఆవరణంలో ఒక గదిలో పుస్తకాలు అమ్ముతున్నట్లు గుర్తించి, ఆ గదిని ఎంఈఓ సీజ్ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్