ఆకివీడు లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ముస్లిం సోదరులు

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ మరియు జమతే ఇస్లామి హింద్ సంయుక్తంగా మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.డి. బిలాల్ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో ప్రజలకు చల్లటి మజ్జిగ అందించే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్నామని, దీనిని సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని అసోసియేషన్ తెలిపింది. 'మానవసేవే మాధవసేవ' నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్