శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారికి సారే సమర్పణ

ఏలూరు జిల్లా, కైకలూరు మండలంలోని కొల్లేటికోట గ్రామం శ్రీ పెద్దింట్ల అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం గ్రామస్తులు, భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసు స్వాగతం పలికారు. ఉప ప్రధానార్చకులు విశేష పూజలు నిర్వహించి, రవిక, కుంకుమ, గాజులు, ప్రసాదాలు భక్తులకు అందించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్