పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్రీన్ కార్పెట్ అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు యోగాను సాధన చేస్తే విద్యలో బాగా రాణించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగప్రసాదరాజు, శివరామరాజు, సత్తి బ్రహ్మారెడ్డి, HM రామలక్ష్మి, మధు మాష్టారు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది హాజరయ్యారు.