పెద అమిరంలో స్వర్ణాంధ్ర - P4 ప్రథమ వార్షికోత్సవ వేడుకలు సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన P4 పథకం ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా అమలవుతూ లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కూడా పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన వారిని సత్కరించారు.