పాలకోడేరు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

పాలకోడేరు మండలం మొగల్లులో ఆదిరెడ్డి దుర్గారావు (43) అనే ఆర్టీసీ డ్రైవర్, మంచినీళ్లు అనుకుని పొరపాటున పురుగుల మందు తాగి మృతి చెందారు. గత నెల 30వ తేదీ రాత్రి తలనొప్పితో బాధపడుతున్న దుర్గారావు, చీకట్లో నీళ్ల బాటిల్ అనుకుని పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను ఏలూరు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్