చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో భాగంగా 11వ విడత కార్యక్రమాన్ని గురువారం పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ, సుమారు ₹. 18, 90, 000 విలువగల 126 మొబైల్ ఫోన్లను వాటి సంబంధిత యజమానులకు తిరిగి అందజేశామన్నారు.