భీమవరంలో వసుధ ఫౌండేషన్ కుట్టు శిక్షణ కేంద్రం రెండో బ్యాచ్ ప్రారంభం

భీమవరంలో వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రం రెండో బ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. ఈ శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. చేకూరి ఝాన్సీ లక్ష్మి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. మానవతా సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతి రాజు, అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజులు, అల్లు శ్రీనివాస్, చాన్ భాష, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్