మానవత సంస్థ ఉండి శాఖ అధ్యక్షుడు డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ సమాజంలో అభ్యాగ్యులకు చేయూత ఇవ్వడం మానవత్వమని అన్నారు. మానవత సంస్థ నెలవారీ సమావేశం ఉండిలో సోమవారం సజరిగింది. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం సంస్థ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మండల చైర్మన్ రుద్రరాజు యువరాజు, కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు, కన్వీనర్ కొమ్మన నాగబాబు, ట్రెజరర్ కేటీఎన్ తదితరులు పాల్గొన్నారు.