ఆకివీడు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గంధం ఉమా సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉండి ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన భీమవరంలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన గంధం ఉమా సత్యనారాయణ, తనకు అవకాశం కల్పించిన కనుమూరు రఘురామకృష్ణంరాజు, మోటుపల్లి ప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యతను శక్తివంచన లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.