ఉండి: పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్

ఉండి మండలం యండగండి గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై నసీరుల్లా సోమవారం తెలిపారు. వారి నుంచి రూ. 2200, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్